సాక్షి, గాంధీనగర్ : కరోనా కట్టడి దృష్ట్యా అహ్మదాబాద్‌లో విధించిన రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. గత 24 గంటల్లోనే జిల్లాలో 306 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అహ్మదాబాద్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,030 దాటేసింది. దీంతో కర్ఫ్యూ సమయాన్ని పొడిగిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సంజయ్ శ్రీ వాస్తవ వెల్లడించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, దీని ప్రకారం రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. (కరోనా కిల్లర్: ఆఫ్టర్ 28 డేస్...)
గతకొన్ని రోజులుగా జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతుండటంతో నవంబర్ 23న యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. ఆ గడువు నేటితో (డిసెంబర్7) ముగియనుండగా, కరోనా కేసుల దృష్ట్యా కర్ఫ్యూను పాడిగిస్తున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. అయితే పోలీసులు, సివిల్ డిఫెన్స్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హోమ్‌గార్డ్స్, మీడియా సంస్థలు, ఏటిఎం ఆపరేషన్లు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల సిబ్బందికి మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. అధే విధంగా పాలు, వైద్య సిబ్బంది, ఎల్పీజీ వంటి సేవలకు కూడా మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. (కోవిడ్ సెంటర్లో పెళ్లి.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment