వాతావరణం
చాలావరకు ఎండగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. సాయంత్రం నుంచే చలి మొదలవుతుంది. తెల్లవారుజామున మంచు కురుస్తుంది.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ రూరల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబి తాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆదివారం అన్ని పోలింగ్ బూత్‌లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నా రు. ఓటరుగా నమోదు, పేరు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే అధికారులకు ఆధారాలతో తెలియజేయాలని సూ చించారు. 2025, జనవరి 01 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు ఫారం నంబర్ 6తో ఓటరుగా నమోదు చేసుకోవచ్చనన్నారు. కొత్తగా ఓటరు జాబితాలో అభ్యంతరాలకు ఫారం–7, జాబితాలో చిరునామా, సవరణలకు ఫారం–8 ద్వారా నమోదు చే సుకోవచ్చని వివరించారు. అంతకుముందు పాఠశాలను పరిశీలించి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, మరుగుదొడ్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌వో రత్నకళ్యాణి, బూత్‌స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment