వడివడిగా సర్వే..
భైంసాటౌన్: తెలంగాణలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో చకచకా జరుగుతోంది. ఈనెల 9 నుంచి సర్వే ప్రారంభమైంది. జిల్లాలోనూ 398 గ్రామపంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో సర్వే చేపడుతున్నారు. ఈనెల 30 వరకు సర్వే నిర్వహించనుండగా, క్షేత్రస్థాయిలో ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. ఇప్పటివరకు ఆయా గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీల్లో ఇళ్ల జాబితా నమోదు, ఇంటింటికీ తిరిగి స్టిక్కర్ అంటించడంతోపాటు ఇంటింటి సర్వే సైతం చేపట్టారు. ప్రభుత్వం ముద్రించిన నిర్ణీత ఫార్మాట్‌లో ఎన్యుమరేటర్లు కుటుంబ వివరాలను సేకరించి నమోదు చేస్తున్నారు. మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని ఎన్యుమరేటర్లు సూపర్‌వైజర్లకు అందిస్తుండగా, శుక్రవారం నుంచి సర్వే వివరాల ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు వివరాల ఆన్‌లైన్ నమోదుపై ఇప్పటికే బాసర ట్రిపుల్‌ఐటీలో సీఎంఆర్‌వో ఆపరేటర్లకు శిక్షణ సైతం అందించారు.
జిల్లాలో ఇలా...
జిల్లాలో మొత్తం 398 గ్రామ పంచాతీయలు ఉండగా, 1,87,424 కుటుంబాలను సర్వేకు గుర్తించారు. వీటిలో 1,54,831 కుటుంబాల సర్వే పూర్తయింది. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో 45,243 కుటుంబాలు ఉండగా, 32,814 కుటుంబాల వివరాలు సేకరించారు. గ్రామ పంచాయతీల్లో 82.61 శాతం, పట్టణాల్లో 72.52 శాతం సర్వే పూర్తయింది. ఈనెలాఖరులోగా వందశాతం పూర్తి చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
సకాలంలో పూర్తి చేస్తాం...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతోంది. భైంసా రూరల్ మండలంలో 89 శాతం పూర్తయింది. నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆన్‌లైన్ నమోదు కూడా ప్రారంభిస్తాం.
– సీహెచ్.కోమల్‌రెడ్డి, ఆర్డీవో(సూపర్‌వైజర్, భైంసా)
జిల్లాలో 80.64 శాతం పూర్తి
మొదలైన ఆన్‌లైన్ ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment