విజ్ఞానశాస్త్రంపై అభిరుచి పెంచుకోవాలి
నిర్మల్ రూరల్: విద్యార్థులు విజ్ఞానశాస్త్రంపై అభిరుచి పెంచుకోవాలని జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ సిద్ధ పద్మ సూచించారు. తెలంగాణ బయోసైన్స్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం జిల్లాస్థాయి బయోసైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిద్ధ పద్మ హాజరై మాట్లాడారు. టాలెంట్ టెస్ట్‌లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
విజేతలు వీరే..
తెలుగు మీడియం నుంచి.. ఎం.సంపద (సిద్దులకుంట జెడ్పీహెచ్‌ఎస్, ప్రథమ), వైభవ్(బోరిగాం జెడ్పీహెచ్‌ఎస్, ద్వితీయ) ఇంగ్లిష్ మీడియం నుంచి.. నందిని(మస్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్, ప్రథమ), జీవనజ్యోతి(లింగాపూర్ జెడ్పీహెచ్‌ఎస్, ద్వితీయ), ఉర్దూ మీడియంలో... ఆశన తస్కిన్(ముధోల్ జెడ్పీహెచ్‌ఎస్, ప్రథమ), ఇర్షాద్ ఖాన్ (బాలికల పాఠశాల భైంసా, ద్వితీయ) గెలుపొందారు. వీరికి ఈనెల 28న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్ జరుగుతుంది. ఇందులో ఎస్‌వోలు రాజేశ్వర్, నరసయ్య, సలోమి కరుణ, ప్రవీణ్, లింబాద్రి, డీఎస్‌వో వినోద్, జిల్లా బయోసైన్స్ ఫోరం అధ్యక్షుడు సత్తెన్న, కార్యదర్శి సుష్మారాణి, గౌరవ అధ్యక్షుడు మోహన్‌రావు, సురేశ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment