గోదావరి బ్రిడ్జిపై ఇనుప కంచె
● ఎస్పీ జానకీషర్మిల
బాసర: బాసరలో గోదావరి వద్ద ఇటీవల ఆత్మహత్యలు పెరిగాయి. గోదావరి బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. దీనిపై ‘సాక్షి’లోనూ పలుమార్లు కథనాలు ప్రచురించాం. ఎట్టకేలకు జిల్లా పోలీస్ బాస్ స్పందించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన వారు గోదావరి వంతెనపై నుంచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్‌తో కలిసి వంతెనను పరిశీలించిన ఎస్పీ జానకీషర్మిల, ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వంతెనపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు 24 గంటలు పర్యవేక్షించేలా సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్ పోలీసుల సహకారంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతోపాటు రెండు ద్విచక్ర వాహనాలు, బ్లూకోట్ సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. గోదావరిలో దూకినవారిని కాపాడిన గంగపుత్రులను అభినందించారు. తర్వాత పుష్కర ఘాట్లను, బస్, రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. ఎస్పీ వెంట ముధోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్సై గణేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment