12వ రోజుకు ‘సమగ్ర’ సమ్మె
నిర్మల్ రూరల్: తమ డిమాండ్లు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె శని వారం 12వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు. విద్యాశాఖలో తాము కూడా అంతర్భాగమని సూచిస్తూ ఓ లోగోను ప్రదర్శించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావును అతని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తాము చేస్తున్న నిరసన కార్యక్రమాల గురించి వివరించారు. ఎస్టీయూ అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్, జిల్లా అధ్యక్షుడు భూమనయాదవ్ శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఇందులో నాయకులు గంగాధర్, రాజారత్నం, నరేశ్, సాయినాథ్, రమేశ్, రమణ, నరసయ్య, హరీశ్, శ్రీనివాస్, విఠల్, విమల, వసంత, లతాదేవి, జ్యోతి, వీణ, నవిత పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment