చట్టాలపై అవగాహన ఉండాలి
● జూనియర్ సివిల్ జడ్జి జితిన్‌కుమార్
కడెం: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఖానాపూర్ ఫ్టస్ట్‌క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జితిన్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. క్షణికావేశంలో ఎలాంటి తప్పులు చేయవద్దని పేర్కొన్నారు. తప్పు జరిగితే న్యాయం కోసం పోలీసు స్టేషన్ లేదా కోర్టును ఆశ్రయించాలని తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ సైధారావ్, కడెం ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి, న్యాయవాదులు వెంకట్ మహేంద్ర, బాసెట్టి శివ, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌వోలు గీతారాణి, అనిత, డీఆర్వోలు సిద్ధార్థ, ప్రకాశ్, పోలీసులు, అటవీ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment