ఆగని ధాన్యం దందా..!
భైంసాటౌన్: జిల్లాలో ధాన్యం దందా ఆగడం లేదు. కొందరు రైస్‌మిల్లర్లు రాత్రి వేళల్లో లారీల్లో ధాన్యం జిల్లా దాటిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ మిల్లులకు కేటాయిస్తుండగా, కొందరు మిల్లర్లు ధాన్యం పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై ప్రభుత్వం ఓ వైపు కొరడా ఝళిపిస్తుండగా, మరోవైపు ధాన్యం అక్రమ తరలింపు మాత్రం ఆగకపోవడం గమనార్హం. పట్టణంలోని ఓ గోదాం నుంచి శుక్రవారం రాత్రి దాదాపు ఐదు లారీల్లో ధాన్యం నాగ్‌పూర్‌కు తరలించినట్లు తెలిసింది. రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు నకిలీ వేబిల్లులు సృష్టిస్తూ అక్రమంగా తరలించినట్లు సమాచారం. ఇలా ఒక్కచోటే కాదు.. జిల్లా నుంచి నిత్యం ధాన్యం అక్రమంగా తరలుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment