అలిశెట్టి సాహిత్యంతోనే సామాజిక చైతన్యం
నిర్మల్‌ఖిల్లా: అలిశెట్టి సాహిత్యంలోనే సామాజికచైతన్యం వెల్లివిరిసిందని తెలంగాణ రచయితల వేది క గౌరవాధ్యక్షుడు డాక్టర్ దామెర రాములు పేర్కొన్నారు. ఆయన ప్రజాచైతన్యం కోసం కవిత్వం రా శారని, అవినీతి, దోపిడీ దౌర్జన్యాలపై అక్షర పిడిబాకులు దించారని పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ది వంగత సాహితీవేత్త, కవి, రచయిత అలిశెట్టి ప్రభా కర్ జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలిశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలవోక పదాలతో కవిత్వం రాసి సామాన్యుల గుండెల్లో నిలిచారని, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సాహితీజీవనం కొనసాగించారని పలువురు కవులు, రచయితలు కొనియాడారు. అలిశెట్టి సాహిత్యాన్ని ముందు తరాలకు అందించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో వేదిక జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, మానస సాహితీ సే వా సంస్థ అధ్యక్షుడు తుమ్మల దేవరావు, నిర్మల భా రతి గౌరవాధ్యక్షుడు బొందిడి పురుషోత్తమరావు, తెతెలంగాణ రచయితల వేదిక జిల్లా కోశాధికారి పోలీస్ భీమేశ్, సలహా సభ్యుడు పత్తి శివప్రసాద్, ఈసీ మెంబర్లు జగదీశ్వర్, నాగారం, సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి, మునీంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment