ఘనంగా సంక్రాంతి ఉత్సవం
నిర్మల్‌ఖిల్లా: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో సంక్రాంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సృజన్ సామ్రాట్ హాజరై పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు. అంతకుముందు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకారిణి సభ్యుడు డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం, జిల్లా సంఘ చాలక్ నూకల విజయ్‌కుమార్, నగర సంఘచాలక్ డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, హిందూ విభాగ్ కార్యవహ రాజులవారి దిగంబర్, అల్లాడి సూర్యనారాయణ, మంచిరాల నాగభూషణం, కిన్నెర రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment