వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రతిభ
ఖానాపూర్: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మస్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. యూత్ విభాగంలో విష్ణు 49 కేజీల పోటీల్లో సిల్వర్ మెడల్, 55 కేజీల జూనియర్స్ విభాగంలోనూ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు నరేందర్‌రావు, పీఈటీ ఇమ్రాన్ తెలిపారు. శివసాయి 67 కేజీల విభా గంలో సిల్వర్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment