నిర్మల్
మంగళవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2025
సంబురంగా
భోగి
భోగిమంటకు నమస్కరిస్తూ...
మూడు రోజుల సంక్రాంతి వేడుకలు భోగితో జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరూరా, వాడవాడలా కూడళ్లలో సోమవారం వేకువజామునే భోగి మంటలు వేశారు. ఇళ్లలోని పాత వస్తువులను ఆ మంటల్లో వేసి కష్టాలు, నష్టాలు, కోపాలు తాపాలు దహించుకుపోవాలని పూజలు చేశారు. అందరికీ భోగభాగ్యాలు ఇవ్వాలని వేడుకున్నారు. అనంతరం భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. అనంతరం మహిళలు, యువతులు ముంగిళ్లలో అందమైన రంగవల్లులు వేశారు. ముగ్గులో గొబ్బెమ్మలను ఉంచి పూజించారు. తర్వాత చిన్నారులకు భోగిపండ్లు పోశారు. ఇక పట్టణాల్లో పతంగుల సందడి కనిపించింది. పిల్లలు పెద్దలు పతంగులు ఎగురవేశారు. – నిర్మల్‌టౌన్/సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment