No Headline
పల్లె పట్నం తేడాలేకుండా ఎంతో ఇష్టంగా జరుపుకునే మకర సంక్రాంతి. గ్రామీణ వాతావరణం ఉమ్మడి కుటుంబాలు, అనుబంధాలు, ఆత్మీయతల సమ్మేళనాలతో అన్ని కుటుంబాల్లో ప్రత్యేక శోభ నింపుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలంతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడంతోపాటు, పుష్య నక్షత్ర యుక్తంగా ఈసారి మకర సంక్రాంతి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రోజుల పండుగలో భాగంగా సోమవారం భోగితో జిల్లాలో సందళ్లు మొదలయ్యాయి. జిల్లాలో చిన్న పిల్లలపై భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడుదృష్టి కూడా తొలగిపోతుందని నమ్మకం. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాలలో ఈ సంప్రదాయం సోమవారం రోజున కొనసాగింది. వేకువజామునే ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు.
– నిర్మల్‌ఖిల్లా
Comments
Please login to add a commentAdd a comment