సక్కరివారి పరివారం..
● మొదలైన మూడురోజుల సంబరాలు... ● ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగులు... ● చిన్నారులకు భోగిపండ్ల వేడుకలు ● ఉమ్మడి పరివార సందళ్లు... ● నేడు సంక్రాంతి, రేపు కనుమ...
నేడు మకర సంక్రాంతి...
సంక్రాంతి అంటే వెలుగుతో కూడిన గమ్యం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభదినాన నువ్వులు, బెల్లం కలిపి లడ్డూలు చేసుకుని నోములు నోచుకోవడం ప్రత్యేకం. మకర సంక్రమణం రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. అందుకే దేవుని పూజించి నువ్వుల లడ్డూలను ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘాయుష్షు చేకూరుతుందని శాస్త్రం చెబుతుంది.
సమైక్య‘కాంతి’..
సంక్రాంతి పర్వదినం వైభవంగా జరుపుకునేందుకు దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లా వాసులు తమ స్వస్థలాలకు వచ్చేశారు. సొంత ఊళ్లలో, సొంత ఇంటిలో మూడుతరాల ముచ్చట్లమధ్యన సమైక్యంగా పండగ సంబరాలను నిర్వహించుకుంటున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న పరివారం అంతా ఒకే కుటుంబానికి చెందినది. ఇందులో మూడు తరా లవారు ఉన్నారు. ఉద్యోగం, ఉపాధి రీత్యా వివి ధ ప్రాంతాల్లో స్థిరపడగా సంక్రాంతి పండుగకు అంత ఒకే చోట కలుసుకోవాలని నిర్ణయించుకు ని రెండేళ్లుగా ఈ ఆనవాయితీని పాటిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జిల్లాలోని దిలావర్‌పూర్ మండలం టెంబుర్ని గ్రామసమీపంలో వీరంతా ఒకేచోట కలుసుకున్నారు. సోమవారం అక్కడి శ్రీచక్ర లింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపులో భాగంగా మూడు దశాబ్దాల క్రితం తమ గ్రామం అంతరించిపోగా అప్పటి కుటుంబానికి చెందిన అన్నదమ్ములు తమ పిల్లలతో వెళ్లిపోయి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నర్సాపూర్(జి), భైంసా, నిర్మల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఉపాధి నిమిత్తం వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరంతా సంక్రాంతి పండుగ సందర్భంగా కలుసుకుంటున్నారు. తమ సక్కరి పరివార నేపథ్యం తాతలు, తండ్రులు వారి వంశ వృక్షం నేటి తమ నాలుగో తరం చిన్నారులకు తెలియ చెప్పాలనే ఉద్దేశంతోపాటు బంధాలు అనుబంధాల ప్రాధాన్యతను చాటాలని ఏటా ఇలా కలుసుకుంటున్నామని రెండో తరం కుటుంబసభ్యులైన విఠల్, వినాయక్, రుద్రమదేవి, సుధాకర్, మధుకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment