పదోన్నతి పొందిన జిల్లావాసికి సన్మానం
నిర్మల్‌ఖిల్లా: విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఇటీవల జనగామ జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పదోన్నతి పొందిన జిల్లాకేంద్రానికి చెందిన దర్శనం భోజన్నను తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్)ఆధ్వర్యంలో సన్మానించారు. పట్టణంలోని మంజులాపూర్‌కు చెందిన భోజన్న గతంలో నిర్మల్ జిల్లా విద్యాశాఖలో, ఆదిలాబాద్ డైట్ కళాశాలలో పర్యవేక్షకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు అనంతరం మొదటి ఏడీగా పదోన్నతి పొంది విద్యాశాఖకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.మురళిమనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్‌ఖాన్, నాయకులు ఎన్.శరత్ చందర్‌రెడ్డి, మేడారం శ్రీనివాస్, మతీన్, వి.ముత్తన్న, భోజన్న తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment