కుమ్మరుల జీవన ప్రమాణాల మెరుగునకు కృషి
నిర్మల్‌ఖిల్లా: కుమ్మరుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంతోపాటూ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక గౌరవాన్ని కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో కుమ్మ రి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(కేవా) రూపొందించిన నూతనసంవత్సర క్యాలెండర్ ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మరి సామాజికవర్గ వ్యక్తులు ఉన్నతంగా ఎదుగుతూనే, సామాజిక సేవలోనూ ముందుండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేవా జిల్లా అధ్యక్షుడు తొడిశెట్టి పరమేశ్వర్, జిల్లా నాయకులు చంద్రయ్య, మరుపాక శ్రీనివాస్, ప్రసాద్, శ్యాంసుందర్, శంకర్, నారాయణ, రవికాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment