రైతుల అభివృద్ధే మోదీ లక్ష్యం
● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కేంద్రీయ పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మోదీ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బోర్డు ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. బోర్డు ఏర్పాటులో రైతుల కృషితోపాటు ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి కూడా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, తక్కల రమణారెడ్డి, ముత్యంరెడ్డి, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, నాయకులు వీరేశ్, విలాస్, పోతన్న, వొడిసెల అర్జున్, సాహెబ్ రావ్, శ్రవణ్, రాజేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్, తిరుమలాచారి, దినేష్, విజయ్, కార్తీక్, సుంకరి సాయి, కొండాజీ శ్రావణ్, ఎల్లయ్య, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
భైంసా రూరల్: మండలంలోని పెండ్‌పెల్లి గ్రామంలో పసుపు పంటలో ఎమ్మెల్యే రామారావ్ పటేల్ ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. ప్రధాని ఇచ్చిన మాటప్రకారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేశారన్నారు. బోర్డు ఏర్పాటుకు కృషిచేసిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పండిత్‌రావ్, సుష్మారెడ్డి, శ్రీనివాస్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment