ప్రభుత్వ భూముల సరిహద్దులు చూపించండి
● తహసీల్దార్‌కు పొట్టపల్లి(కే) గ్రామస్తుల వినతి
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి గ్రామంలోని ప్రభుత్వ భూముల సరిహద్దులు చూపాలంటూ గ్రామస్తులు తహసీల్దార్ జానకీకి విన్నవించారు. మండలంలోని పొట్టపల్లి(కే) గ్రామానికి చెందిన వందల మంది గ్రామస్తులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఐదేళ్లుగా తమ గ్రామంలోని సర్వే నంబర్ 1, 2, 3, 4లలోని ప్రభుత్వ భూముల సరిహద్దులను చూపాలంటూ అధికారులకు విన్నవిస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది వరకే గ్రామంలోని ప్రభుత్వ భూములను మండల సర్వేయర్‌తో సర్వే చేయించామని తహసీల్దార్ తెలిపారు. ప్రస్తుతం మండలంలో పలు సంక్షేమ పథకాల సర్వే ఉందని, అధికారులు సర్వే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. వారంలో సర్వే పూర్తి అవుతుందని తెలిపారు. అనంతరం ఏడీ వ్యవసాయ శాఖ అధికారి గ్రామానికి వచ్చేందుకు అధికారి నుంచి తగిన సమయం తీసుకుంటామని, అందుకు కనీసం 15 రోజుల కావాలని కోరారు. ఏడీ సమయం ఇవ్వగానే గ్రామానికి వచ్చి ప్రభుత్వ భూముల సరిహద్దులు చూపిస్తామన్నారు. తహసీల్దార్ హామీతో గ్రామస్తులు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment