నల్లవెల్లిలో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

నల్లవెల్లిలో వివాహిత ఆత్మహత్య

Published Tue, Nov 21 2023 1:16 AM | Last Updated on Tue, Nov 21 2023 10:55 AM

- - Sakshi

నిజామాబాద్: మండలంలో ని నల్లవెల్లిలో ఆదివారం రా త్రి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేశ్‌, స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జగన్నాథచారితో నిజామాబాద్‌ నగరానికి చెందిన స్నేహలత(23)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్లలోపు వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన స్నేహలత ఆత్మహత్యకు పాల్పడగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం అంత్యక్రియల అనంతరం స్నేహలత మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. వారి ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసులు జగన్నాథచారి కుటుంబ స భ్యులను అదుపులోకి తీసుకొని రక్షణ కల్పించారు. మృతురాలి తండ్రి రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

జీవితంపై విరక్తితో యువకుడు..
బాల్కొండ: అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెంది వరద కాలువలో దూకి మండలంలోని బోదేపల్లి గ్రామానికి చెందిన కోట శ్రీనివాస్‌(26) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్‌ చెకప్‌ కోసం శనివారం నిజామబద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లిన శ్రీనివాస్‌ తిరిగి రాలేదు. దీంతో ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు కూడా నమోదైంది. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement