డిపో–3లో కల్లు తయారు చేసే యంత్రాలు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నగరంలోని గౌడ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న కల్లు డిపో–3ని రెండుమూడు కుటుంబాలే సొంత జాగీరులా నిర్వహిస్తు న్న నేపథ్యంలో.. దీని మనుగడ ప్రశ్నార్థకమవుతోందని సొసైటీ సభ్యులు, గీత కార్మికులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. తమకు తీవ్ర అన్యాయంతో పాటు బదనాం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. మొత్తం సొసైటీని సదరు కుటుంబాలు భ్రష్టు పట్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. సర్వసభ్య సమావే శం ఏర్పాటు చేయకుండా, లెక్కలు చెప్పకుండా ఇష్టారీతిన చేస్తుండడంతో సొసైటీ కనుమరుగయ్యే దుస్థితి నెలకొంటోందని అంటున్నారు. దీన్ని కాపా డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిర్వాహకులకు చెప్పినప్పటికీ ఫలితం లేదన్నారు. టెండర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి గీత కార్మికుడికి ఆబ్కారీ శాఖ ద్వారా ఐడీ కార్డులు ఇవ్వాలని సభ్యులు డి మాండ్ చేస్తున్నారు.
● కేవలం 250 మంది సభ్యులు, 53 మంది గీత కా ర్మికులు, 20 మంది కులపెద్దలు ఉన్న డిపో–3లో చేయాల్సిన చెల్లింపులు చేయకుండా ఇద్దరు ము గ్గురే మొత్తం దండుకుంటున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. డిపో–1 సొసైటీలో మాదిరిగా గీత కార్మికులకు, సంఘం సభ్యులకు ఇస్తున్నట్లు గౌరవ వే తనం డిపో–3లో కూడా చెల్లించాలని డిమాండు చేస్తున్నారు. అదేవిధంగా 3వ సొసైటీలో కొత్త ట్యా పర్లు, మిస్ అయిన పాత సభ్యులకు అవకాశం క ల్పించాలని జనరల్ బాడీలో, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీర్మానించినట్లు సభ్యులు ప్రస్తావిస్తున్నారు. 11 దుకా ణాలు మాత్రమే నడుస్తున్న డిపో–1 సొసైటీలో 2,200 మంది సభ్యులు ఉండగా అక్కడ ప్రతి సభ్యుడికి రూ.2,300 చొప్పున, 141 మంది గీత కా ర్మికులకు ఒక్కొక్కరికి రూ.7,700, వనం నిర్వాహకులకు 45 మందికి రూ.8వేల చొప్పున, సిట్టింగ్‌లకు 74 మందికి రూ.4వేల చొప్పున, అధ్యక్షుడికి రూ.25వేల జీతం, ఉపాధ్యక్షుడికి రూ.12,500, ఏ డుగురు డైరక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ.35 వేలు ఇస్తున్నారని, అయితే అతి తక్కువ సభ్యులున్న 19 దుకాణాలున్న డిపో–3లో మాత్రం చెల్లింపులు ఇవ్వకుండా అన్యాయం చేయడమేమిటని సభ్యులు, ట్యాపర్లు వాపోతున్నారు.
● డిపో–3 సొసైటీలో ఇప్పటివరకు జమ, ఖర్చుల వివరాలు తెలపలేదని, తక్షణమే ఆడిట్ చేయించి పూర్తి వివవరాలు వెల్లడించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గౌడ కుల సంఘంలో టెంట్ కింద కూ ర్చున్న గౌడ సభ్యుల్లో అడిగినవారికి సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
● ఈత వనం పెంచడానికి భూమి కొనుగోలు కో సం ప్రతిరోజు వచ్చే డబ్బుల నుంచి 20 శాతం పక్కకు తీయాలని సభ్యులు కోరుతున్నారు. కులం మీటింగ్(డిపోలో) జరిగినప్పుడు 1వ సొసైటీ మా దిరిగా డబ్బులు పెంచుతామని చెప్పి వదిలేశారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు కాకుండా టెండర్లు ఏర్పాటు చేయాలని, సొ సైటీని బదనాం చేయడం సరికాదని అంటున్నారు.
రెండుమూడు కుటుంబాలదే పెత్తనం
సొసైటీని భ్రష్టు పట్టిస్తున్నారంటున్న
సభ్యులు, గీత కార్మికులు
ఇలా అయితే సొసైటీ మనుగడే
ప్రశ్నార్థకమంటూ ఆందోళన
టెండర్లు నిర్వహించాలని డిమాండ్
డిపో–3 సొసైటీని సక్రమంగా నడిపి ప్రతి ట్యాపర్‌కు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ద్వారా గుర్తింపు కార్డు ఇప్పించాలని సభ్యులు కోరుతు న్నారు. ట్యాపర్స్‌కు, డిపోలో పనిచేసే కుల స భ్యులకు సొసైటీ నుంచి జీవిత బీమా కట్టాలని, ప్రతి ట్యాపర్‌కు, కుల సభ్యుడికి దీపావళి బోన స్ ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన ట్యాపర్లకు ఎకై ్స జ్ సూపరింటెండెంట్ ద్వారా ప్రభుత్వ పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. సొసైటీ నిర్వహణ అస్తవ్యస్తంగా, కొందరి స్వార్థం కోసమే నడుస్తుండడంతో ఇవేవీ అమలు చేయలేని పరిస్థితి నెలకొందని సభ్యులు చెబుతున్నారు.
ఖాళీ అయిన అధ్యక్షుడు, డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించాలని, ఇంటి వాళ్లకు, బంధువులకు కాకుండా కుల సభ్యుల నుంచి ఎన్నుకోవాల్సిన అవసరముందని గౌడ కులస్తు లు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఇష్టానుసారంగా నడుపుతూ సొసై టీని బదనాం చేస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment