● భారీ షాపుల ముందు స్థలాలు అద్దెకు
● ట్రేడ్‌లైసెన్సులు లేకుండానే వ్యాపారం
● ఫుట్‌పాత్‌లు ఆక్రమణ.. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
● బల్దియా ఆదాయానికి రూ. కోట్లలో గండి
వ్యాపారాలు నిర్వహించుకోవాలంటే ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకుని వ్యాపారాలు చేయాలి. అవి చిన్నవైనా, పెద్దవైనా సరే.. అయితే కొందరు వ్యాపారులు నిబంధనలను ఖాతరు చేయడం లేదు. అక్రమంగా దుకాణాలు నిర్వహిస్తున్నారు. భారీ షాపుల ఎదుట ఖాళీ స్థలాన్ని చిరు వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అద్దెకు ఇస్తున్నారు. దీంతో బల్దియా ఆదాయా నికి ప్రతి నెలా రూ. కోట్లలో గండి పడుతోంది. అదేవిధంగా పలు దుకాణాల ఎదుట ఫుట్‌పాత్‌లను అక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment