ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా..

Published Fri, Nov 22 2024 12:35 AM | Last Updated on Fri, Nov 22 2024 12:35 AM

ట్రేడ

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా..

అహ్మదీ బజార్‌లో రోడ్డుపై దుకాణాలు

తిలక్‌ గార్డెన్‌ వద్ద సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ల పార్కింగ్‌

నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ నగరంలోని ప్ర ధాన వీధుల్లో వ్యాపారాలు జోరుగా సాగుతున్నా యి. ఖలీల్‌వాడీ, హైదరాబాద్‌ రోడ్డు, కుమార్‌గల్లీ, పూసలగల్లీ, ఆర్‌పీ రోడ్డు, బోధ్‌న్‌ రోడ్డు, అహ్మద్‌పు రా కాలనీ, గంజ్‌రోడ్డు నిత్యం జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలు. ఇక్కడ వందల సంఖ్యలో దుకాణాలు నిర్వహిస్తున్నారు.

పెద్ద షాపులు, హోల్‌సెల్‌ మార్కెట్‌, వస్త్రవ్యాపా రాలు, ఇతర వ్యాపారాలు సాగుతున్నాయి. వీరు విశాలమైన స్థలంలో షెట్టర్‌లలో (మడిగె) వ్యాపారాలు చేస్తున్నారు. అయితే వీరి భారీ షాపుల ముందు టీ స్టాల్స్‌, పాన్‌ షాపులు, చిరు వస్త్ర వ్యాపారులు, కూరగాయాలు అ మ్మేవారికి, ఇతరులకు స్థలం అద్దెకు ఇస్తున్నారు. గంజ్‌ మార్కెట్‌లో రో డ్డుకు ఇరువైపులా ఉన్న హోల్‌సెల్‌ దుకాణాలు, ఎరువులు, రసాయనాలు అమ్మే షాపులు, ఐరన్‌ షాపులు, కిరాణా షాపుల వారు తమ దుకాణాల ముందు మరో చిన్న షాపులు అద్దెకిస్తున్నారు. నెల కు రూ. 5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు.

ట్రేడ్‌లైసెన్సులు లేకుండానే..

నగరంలో ఎలాంటి వస్తు విక్రయం జరపాలన్నా బల్దియా అనుమతి అవసరం. అందుకు ట్రేడ్‌ లైసె న్స్‌ టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి రెండుసార్లు రెన్యూవల్‌ చేసుకోవాలి. అయితే పెద్దషాపుల వారు తమ షాపుల ముందు ఏర్పాటు చేయిస్తున్న చిన్న వ్యాపారాలకు ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదు. తద్వారా బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నారు. రోడ్డు మీద జామకాలు, ఇ తర పండ్లు వంటి వాటిని విక్రయిస్తేనే వారి వద్ద నుంచి థాయ్‌ బజార్‌ పేరిట రూ.20 వసూలు చేస్తున్నారు. కానీ దర్జాగా నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్న వ్యాపారానికి మాత్రం ఎలాంటి అనుమతి లేదు.

ఆదాయవనరులుగా ఫుట్‌పాత్‌లు..

నగరంలోని ప్రధాన రోడ్లమీద నిర్వహించే వ్యాపారస్తులు ఫుట్‌పాత్‌ను మొత్తం ఆక్రమించేస్తున్నారు. డ్రైనేజీమీదనే కౌంటర్‌లు ఏర్పాటు చేసుకుంటున్నా రు. డ్రైనేజీని కవర్‌చేసి దానిమీద తాత్కాలిక నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఖలీల్‌వాడీలోని హాస్పిటాల్‌ ఎదుట ఫుట్‌పాత్‌ను కబ్జాచేసి పేషెంట్లకు కు ర్చీలు వేసి కూర్చోబెడుతున్నారు. టీస్టాల్స్‌, వంటి దుకాణాలు నిర్వహిస్తున్నారు.

ట్రాఫిక్‌కు అంతరాయం..

దుకాణాల ముందు రోడ్డుమీద వరకు సామగ్రి పెట్టుకోవడంతో, వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

లైసెన్సులు తప్పనిసరి

వ్యాపారం చిన్నాదైనా, పెద్దదైనా అనుమతి తప్పనిసరి. నగరంలో వ్యాపారులు తమకు కేటాయించిన స్థలంలో కొంత ఇతరులకు సబ్‌లీజ్‌ ఇవ్వడం సరికాదు. ట్రైడ్‌ లైనెస్సులేకుండా వ్యాపారం చేయడం నేరం. లైసెన్సులేని వ్యాపారాలతో బల్దియాకు పత్రినెలా రూ. కోట్లలో ఆదాయానికి గండిపడుతోంది. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 100 శాతం ట్రేడ్‌లైసెన్సులు జారీచేస్తాం. గంగిశెట్టి రాజేంద్ర కుమార్‌, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌

సర్వేలతో బిజీగా ఉన్నాం

కార్పొరేషన్‌ పరిధిలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ టౌన్‌ ప్లానింగ్‌ విభాగానిదే. నగరంలో పలుచోట్ల ఆక్రమణలు జరుగుతున్నాయని నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ సర్వే సాగుతోంది. త్వరలోనే ఆక్రమణలను తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం. సిబ్బంది కూడా సరిపడా లేదు. సరిపడా సిబ్బందితో ఈ డ్రైవ్‌ నిర్వహిస్తాం. సత్యనారాయణ, టీపీవో

ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలి

బస్టాండ్‌, ఖలీల్‌వాడీ, గాంధీచౌక్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్నారు. నడుచుకుంటూ వెళ్లేవారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. అర్జంట్‌ పనిమీదవెళ్లేవా రు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్ర మించినవారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. మురళి బాజిరెడ్డి, ఖలీల్‌వాడి వాసి

నగరంలో వ్యాపారం నిర్వహించేవారు

ముందస్తుగానే కార్పొరేషన్‌ నుంచి అనుమతి (ట్రేడ్‌లైసెన్సు) తీసుకోవాలి.

మొదట దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, ప న్నులు పూర్తిగా చెల్లించినట్లు రశీదు జతచేయాలి.

వ్యాపారానికి సంబంధించిన ఆఫీసు

కొలతలు, – బిల్డింగ్‌ ఫొటో సమర్పించాలి.

రోడ్డుకు 1000 స్క్వేర్‌ ఫీట్‌ లోపల వ్యాపారం నిర్వహిస్తే స్కేర్‌ ఫీట్‌కు రుసుము రూ. 2

20 స్క్వేర్‌ ఫీట్‌ల లోపల స్క్వేర్‌ ఫీట్‌కు రూ. 3

20 నుంచి 30 స్క్వేర్‌ ఫీట్‌ల లోపల స్క్వేర్‌ ఫీట్‌కు రూ. 5 చొప్పున రుసుము నిర్ణయిస్తారు.

అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహించిన వారు 90 రోజుల లోపు అయితే 25 శాతం ఫైన్‌తో రుసుము చెల్లించాలి. 90 రోజులు దాటితే 50 శాతం ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది.

కమర్షియల్‌ భవనాలకు ఫైర్‌సేఫ్టీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

ఈ అనుమతి 11 నెలలకు వర్తిస్తుంది. సకాలంలో రెన్యూవల్‌ చేసుకోకపోతే అసలు పన్నుతోపాటు 25 రెట్లు అధికంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా.. 
1
1/4

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా..

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా.. 
2
2/4

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా..

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా.. 
3
3/4

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా..

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా.. 
4
4/4

ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవడం ఇలా..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement