ముగియనున్న మున్సిపల్ పదవీకాలం
ఆర్మూర్: రాష్ట్రంలో మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 26తో ముగియనుంది. ఈక్రమంలో జిల్లాలో ఉన్న నిజా మాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూ ర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పదవులు వీడనున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి ఆయా పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నా లు ప్రారంభించాయి.
బీసీ మహిళా చైర్‌పర్సన్‌లు..
నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాలన్నీ బీసీ మహిళలకు రిజర్వు అయ్యాయి. నిజామాబాద్ మేయర్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన దండు నీతూకిరణ్ ఐదేళ్ల పాటు విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన పండిత్ వినీత మొదట బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో అధికా ర మార్పు అనంతరం మెజారిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరి, 2024 జనవరిలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. మార్చిలో కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల్‌దేవి లావణ్య చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన తూము పద్మాశరత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగా, రాష్ట్రంలో అధికార మార్పుతో ఆమె కాంగ్రెస్‌లో చేరి, బాధ్యతలు కొనసాగించారు. భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో నాటీ బీఆర్‌ఎ స్ నాయకులు అధికార బదిలీ ఒప్పందం చేయడంతో మొదట మల్లెల రాజశ్రీ అనంతరం కన్నె ప్రేమలత చైర్‌పర్సన్‌లుగా ఎన్నుకోబడ్డారు. కన్నె ప్రేమలత బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ మినహా ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. మరో ఐదారు రోజుల్లో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. తర్వా త జరిగే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వ హిస్తారో పూర్తి స్పష్టత రాలేదు. కాగా ఆయా మున్సిపాలిటీలపై తమ జెండా ఎగరవేసి పట్టు సాధించ డం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించారు.
ఈనెల 26 తర్వాత మాజీలు కానున్న చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు
మళ్లీ అధికారం చేపట్టాలని ప్రయత్నాలు ప్రారంభించిన పార్టీలు
ఇదీ పరిస్థితి..
2019–2020 నాటి ఎన్నికల్లో పలు గ్రామాలను విలీనం చేయడం ద్వారా 2011 జనాభా లెక్కల ఆధారంగా నిజామాబాద్ కార్పోరేషన్ పరిధిలో 60 వార్డులను, ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులను, బోధన్ మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులను, భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులను విభజించి రిజర్వేషన్లు సైతం ఖరారు చేసి ఎన్నికలను నిర్వహించారు. 2020 జనవరిలో ఆయా మున్సిపాలిటీలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. నాటి ఎన్నికల్లో కార్పోరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకోగా రాష్ట్రంలో అధికార మార్పు అనంతరం పార్టీ ఫిరాయింపులతో నిజామాబాద్ కార్పొరేషన్ మినహా ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో జమ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment