ఉదయం చల్లని గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి మంచు కురుస్తుంది. చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి.
● పండిత్ ఏల్చూరి వద్ద ఆయుర్వేదం సైతం ప్రభాకర్ నేర్చుకున్నారు. (పండిత్ ఏల్చూరి ద్వారానే ఆయుర్వేద వైద్యం అత్యంత ప్రాచుర్యం పొందింది). అదేవిధంగా వనమూలికల ద్వారా వైద్యం చేయడం గురువు నర్సయ్య వద్ద నేర్చుకున్నారు. 1990 నుంచి ఆయుర్వేదం, మూలిక వైద్యం చేస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాలతో పాటు హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది క్యాన్సర్, గుండె, కిడ్నీ, పైల్స్, ఫిట్స్, గురక, సయాటికా, డిస్క్, సర్వైకల్, చిన్నపిల్లల న్యూమోనియా తదితర దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ‘ఆశించినవాడు శాసించలేడు’ అనే విధానాన్ని పాటిస్తూ ఎలాంటి లాభం ఆశించకుండా పేదలకు వైద్యం చేస్తుండడం ప్రభాకర్ యొక్క మరో ప్రత్యేకత. యోగాను మరింత విస్తృతం చేసేందుకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ప్రభాకర్ చెబుతున్నారు. వాడవాడలా యోగా కేంద్రాల నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నానని, ఇందుకు పలువురు ముందుకు వస్తుండడంతో ఒక్కక్కటిగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేదం సైతం భవిష్యత్తు తరాలకు అందించేందుకు తనవంతుగా పాటుపడతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment