సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ
నిజామాబాద్‌అర్బన్: గణతంత్ర దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఆహార భద్రత(రేషన్ కార్డులు), రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిర మ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియ గా అ మలు చేయనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆ యా పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు గుర్తు చేశారు. వాటికి సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయన్నారు. ఇప్పటికీ ఎవరైనా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథ కాల కోసం దరఖాస్తు చేసుకోనట్లయితే, అలాంటి వారు కూడా ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వ హించనున్న గ్రామ సభలలో కూడా అర్జీలు సమ ర్పించవచ్చని తెలిపారు. వీలుపడని వారు ప్ర జా పాలన సేవా కేంద్రాలలో సంక్షేమ పథకాల కో సం దరఖాస్తులు అందించవచ్చన్నారు. ప్రజాపాలన కా ర్యక్రమంలో రేషన్ కార్డులు, ఇతర పథకాల కోసం తెల్ల కాగితాలపై వచ్చిన దరఖాసుల్తను సైతం పరిశీలిస్తామన్నారు. సంక్షేమ పథకాలు వర్తింపజేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ఇటీవల జరిగిన సామాజిక, ఆర్థిక సర్వేలోనూ రేష న్ కార్డులు అవసరం ఉన్న కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, ఇతర పథకాలు అందజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రులు పేర్కొన్నారు. ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునే వారి నుంచి అర్జీలు స్వీకరించేలా అవసరమైన చర్యలు తీ సుకోవాలని కలెక్టర్లకు మంత్రులు, సీఎస్ సూచించారు. ఎలాంటి గందరగోళం, తప్పిదాలకు తావు లేకుండా గ్రామ సభలు సజావుగా జరిగేలా పక డ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతు భరోసా పథకం అమలులో భాగంగా ని యమించిన విచారణ బృందాలు వ్యవసాయ యో గ్యం కాని భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని మంత్రులు సూచించారు. వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో పని చేసి నివేదిక అందించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పంట సాగు వివరాలు, తహసీల్దార్ల వద్ద నాల భూముల కన్వర్షన్ వివరాలు పరిశీల న్నారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అమలవుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి కుటుంబానికి మంజూరు చేస్తామన్నారు. గ్రామసభలు నిర్వహించి చర్చిస్తామన్నారు. వీడి యో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్‌వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు వర్తింపు
ఇప్పటికీ దరఖాస్తులు చేసుకోని వారు అర్జీలు సమర్పించాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల
Comments
Please login to add a commentAdd a comment