రసాభాసగా చివరి సమావేశం !
● ఎజెండా అంశాలు చర్చించకుండానే ముగిసిన నిజామాబాద్ నగర
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం శనివారం రసాభాసాగా సాగింది. ఎజెండా అంశాలు చర్చించకుండానే సమావేశాన్ని ముగించేశారు. నగరంలోని పలు కూడళ్లలో తోపుడు బండ్లు, కూరగాయలు అమ్మేవారిని తొలగించకుండా అక్కడే అమ్ముకోనివ్వాలనే అంశం ఎజెండాలో చేర్చాలని ఎంఐఎం కార్పొరేట ర్లు పట్టుపట్టారు. నిబంధనలు ఒప్పుకోవని చెప్పడంతో మేయర్ నీతుకిరణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పది నిమిషాలు సభ వాయిదా పడింది. నగరంలో అక్రమ కట్టడాలు, రోడ్లు ఆక్రమణపై బీజేపీ కార్పొరేటర్లు ప్రతి నినాదాలు చేశారు. రెండు గంటల పాటు ఆందోళనతో మేయర్ సభ ముగిసిందని ప్రకటించారు.
బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్పా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment