ఖలీల్‌వాడి: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలోని మురికి కాలువలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు మగ శిశువు మృతదేహం పడేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆరుగురిపై కేసు నమోదు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతానికి చెందిన ఖాజా దాదయ్య, అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారన్న ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. తన ఇంటి పక్కనే ఉన్న టేకు కాశీరాం అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవారని బాధితుడు తెలిపినట్లు ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నీటి విషయమై ఇరు కుటుంబాలకు జరిగిన వివాదంలో కాశీరాంతో పాటు అతని కుటుంబ సభ్యులు తనతో పాటు తన తమ్ముడి భార్య నాగమణి, కోడలు శాంతను కట్టెలతో కొట్టారని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కాశీరాం, ఆయన భార్య పోశవ్వ, కొడుకులు రమేష్, రాములు కోడలు అనిత, కూతురు సంధ్యపై కేసు నమోదు చేశామన్నారు.
తల్లీకొడుకు అదృశ్యం
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన కంఠేశ్వర్ మేఘన(25), ఆమె కొడుకు గౌరీష్ (6) కనిపించకుండా పోయినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఇద్దరు కనబడటం లేదు. పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె అత్త సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment