మంచు ముసుగులో నందిగామ
●
నీరు ఎక్కువగా తాగాలి
చలికాలంలో మంచి నీరు తక్కువగా తాగుతుంటారు. దీంతో రెండు, మూడు నెలల తర్వాత కిడ్నీల్లో రాళ్లు రావడం చూస్తుంటాం. కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకో వాలి. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారు, ఆస్తమా రోగులు వేకువ జామున, రాత్రి వేళ్లల్లో బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఒకవేళ వెళ్లినా ఇన్‌హేలర్‌ను దగ్గర ఉంచుకోవాలి. వాకింగ్ చేయాల్సి వస్తే సూర్యోదయం తర్వాత మంచిది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాకింగ్ చేస్తే కొందరు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలి కాలంలోనూ ఆరోగ్యంగా ఉండవచ్చు.
– డాక్టర్ ఎస్.దుర్గాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, జీజీహెచ్
అప్రమత్తంగా ఉండాలి
చలికాలంలో శ్వాసకోశ వ్యాధులతో అప్రమ త్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేయ కుండా వైద్యులను సంప్రదించాలి. ఆస్తమా ఉన్న వారు చలిగాలులు తగలకుండా చూసుకోవాలి. చలితీవ్రత కారణంగా ఒక్కోసారి గుండెపోటుకు గురికావచ్చు. పోస్టు కోవిడ్ రోగుల్లోనూ చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో దోమకాటుతో డెంగీ, మలేరియా సోకినట్లు, చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.
– డాక్టర్ తిప్పరపు కార్తీక్,
శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు
లబ్బీపేట(విజయవాడతూర్పు): శీతాకాలం ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. చలికూడా ప్రారంభమైంది. ఈ తరుణంలో ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆస్తమా, దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే ఒక్కోసారి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. వీలైనంత వరకూ చలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు. పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రతమత్తంగా ఉండాలంటున్నారు. శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి మాటల్లోనే...
అప్రమత్తంగా ఉండాలి
● మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి.
● దగ్గు, జలుబు ఆయాసం వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
● ఎండ వచ్చిన తర్వాత వాకింగ్ చేస్తే మంచిది.
● తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చలి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
● శ్వాస ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే చలికాలంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు, వేడి ఆహారం తీసుకుంటే మంచిది.
పోస్ట్ కోవిడ్ రోగుల్లోనూ...
● ఇంకా పోస్టు కోవిడ్ రోగుల్లో వేర్వేరు దుష్ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి.
● కొందరిలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. మరి కొందరిలో గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. మరి కొందరు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు.
● ముఖ్యంగా లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న వారు చలికాలంలో అప్రమత్తంగా ఉండకపోతే శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.
● జలుబు, దగ్గుతో పాటు, ఆయాసం, నిమోనియా వంటివి సోకే ప్రమాదం ఉంది.
శీతాకాలంలో పొంచివున్న అనారోగ్య సమస్యలు శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి చలితో గుండెపోటుకు గురయ్యే ఆస్కారం పోస్టు కోవిడ్ రోగులు జాగ్రత్తగా ఉండాలి సూర్యోదయం తర్వాత వ్యాయామం చేస్తే మంచిది
ఉయ్యూరుకు చెందిన రామచంద్రరావు ఇటీవల తుపాను సమయంలో రాత్రి వేళ పనిపై బయటకు వెళ్లాడు. తీవ్రమైన చలిలో ఛాతీలో నొప్పి ప్రారంభమైంది. వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, మైల్డ్ హార్ట్ స్ట్రోక్‌గా వైద్యులు నిర్ధారించారు. ఇలా వీరిద్దరే కాదు.. అనేక మంది చలికాలంలో తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
విజయవాడ పటమటకు చెందిన పావని వారం రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతోంది. జలుబే కదా అన్న నిర్లక్ష్యంతో ఆస్పత్రికి వెళ్లకుండా తెలిసిన మందులు వాడింది. జలుబు, దగ్గు తగ్గకపోగా ఆయాసం, జ్వరం కూడా తోడయ్యాయి. దీంతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్‌చేసి నిమోనియాగా నిర్ధారించారు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment