పంట బోదెలోకి దూసుకెళ్లిన ద్విచక్రవాహనం
వ్యక్తి మృతి
కంకిపాడు: పంటబోదెలోకి ద్విచక్రవాహనం దూసుకెళ్లిన సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు.. మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన కొట్ట గోపి సాయి (30) ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పోరంకిలో నివాసం ఉంటున్నాడు. ద్విచక్రవాహనంపై మంగళవారం తెల్లవారుజామున స్వగ్రామమైన ఉప్పలూరు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. 10 గంటల ప్రాంతంలో బోదెలో వాహనం, వ్యక్తి పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పంట బోదెలో పడిపోవటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు తండ్రి రామలింగేశ్వరరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment