గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలు, సమస్యలను పరిష్కరించడంలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది తమ ఆలోచనాధోరణి మార్చుకోవాలన్నారు. జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల ద్వారా చేపట్టిన అర్జీల పరిష్కారంపై బుధవారం కలెక్టర్ లక్ష్మీశ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లు చేపట్టిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల లక్ష్యాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అర్జీపై శ్రద్ధ పెట్టాలన్నారు. సమస్యల పరిష్కారంలో తప్పించుకొనే ధోరణి ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకూ, కోర్టు కేసులకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment