వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా విజి
జగ్గయ్యపేట: వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మండలంలోని చిల్లకల్లు మాజీ సర్పంచ్ సంపతి విజిత నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. తనను నియమించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి, నియామకానికి కృషి చేసిన నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్‌ను జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment