ఫెన్సింగ్ రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: జాతీయ సీనియర్ సీ్త్ర, పురుషుల ఫెన్సింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు వెర్రు నాగేశ్వరరావు, జి.ఎస్.వి.కృష్ణమోహన్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్న అంతర జిల్లాల ఫెన్సింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఏపీ ఫెన్సింగ్ సంఘం, కృష్ణాజిల్లా ఫెన్సింగ్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 141మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఎ.ఫిర్డౌస్(తమిళనాడు), నితిన్‌స్వైన్ (ఒడిశా), జ్యోతిరంజన్‌ఠాగూర్ (ఒడిశా) వ్యవహరించారు.
ఎంపికై న జట్లు ఇవే..:
పురుషుల ఇప్పీ విభాగంలో కె.కృష్ణ, పి.అంబరీష్, వి.లోకేష్‌సాయి, జి.హేమంత్‌ఈశ్వర్‌రెడ్డి, శాబర్ విభాగంలో దత్తమునిస్వామి, వై.గణేష్, బి.అశోక్, ఓంకార్‌ఈశ్వర్, ఫోయల్ విభాగంలో చందు, నాగమహిజిత్, హెచ్.వరరాజు, ఇ.కాలేశ్వరవరప్రసాద్, మహిళల ఫోయల్ విభాగంలో ఎం.ఉమామహేశ్వరి, బి.లీలాపార్వతి, ఎస్.హారతి, కె.ప్రణీత, శాబర్ విభాగంలో ఎ.బేబిరెడ్డి, వి.యశ్విని, పి.వెంకటహర్షితరెడ్డి, పి.హాసిని, ఇప్పి విభాగంలో ఎస్.శ్రీవర్షిత, సి.హెచ్.శ్రేయ, ఎస్.కె.అఫీఫా, తుషిత ఎంపికై నట్లు ప్రకటించారు. ఈనెల 31 నుంచి జనవరి మూడో తేదీ వరకు కేరళలో జరిగే జాతీయ పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment