1.82 లక్షలు జరిమానా
విజయవాడస్పోర్ట్స్: హెల్మెంట్ ధరించకుండా ద్విచక్ర హనాలు నడుపుతున్న వారికి ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. విజయవాడ నగరంలోని ఆదివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 493 మంది ద్విచక్రవాహనదారులకు రూ.1.82 లక్షల జరిమానా విధించారు. నగరంలోని పలు కూడళ్లలో ఈ డ్రైవ్ నిర్వహించారు. నిర్ణీత కాలంలో జరిమానా చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.
యూఐ చిత్ర యూనిట్ సందడి
లబ్బీపేట/గుణదల(విజయవాడతూర్పు): కోవిడ్ 19, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు, సోషల్ మీడియాతో నిండిన 2040 డిస్టోపియన్ ప్రపంచంలోకి వీక్షకులను తీసుకెళ్లిన చిత్రం యు ఐ అని ఆ సినిమా దర్శకుడు, హీరో ఉపేంద్ర అన్నారు. 2040లో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై యుఐ సినిమాను నిర్మించినట్లు ఆయన వివరించారు. నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో ఉపేంద్ర మాట్లాడుతూ యు ఐ సినిమాను ’పగలు, రాత్రి’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలిపారు. తమ చిత్రానికి ఘనవిజయాన్ని అందించారంటూ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగులో మల్టీస్టారర్ చిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తానని ఉపేంద్ర తెలిపారు. అనంతరం చిత్ర నిర్మాత నవీన్‌మనోహర్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు యు ఐ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసేందుకే విజయవాడ వచ్చినట్లు తెలిపారు. తమ చిత్రం విడుదలకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 576.90 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువకు 8,144 క్యూసెక్కులు వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment