క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
మచిలీపట్నంటౌన్: విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో తర్ఫీదునిస్తే అద్భుతాలను సృష్టిస్తారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 68వ ఏపీ రాష్ట్ర అంతర్ జిల్లాల అండర్ 19 బాలుర క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌కు మచిలీపట్నం వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. క్రీడామైదాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్టేడియం, క్రీడాకారుల వసతి గృహాల నిర్మాణం కోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఐదెకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ కోర్టులు నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, గ్రీన్ స్టోన్ సిఎండి అప్పికట్ల అప్పారావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీలక్ష్మి, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment