పెన్షనర్ల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని పెన్షనర్ల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీవో హోంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న అలపర్తి విద్యాసాగర్‌కు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సత్కారం జరిగింది. అనంతరం జరిగిన సభలో కేవీ శివారెడ్డి మాట్లాడుతూ విద్యాసాగర్ వంటి వ్యక్తులు రాష్ట్రస్థాయి పదవులలో ఉండటం ఏపీఎన్జీవోలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇటీవల తాము ప్రభుత్వ పెద్దలను కలిసిన సమయంలో ఉద్యోగ, కార్మిక పెన్షనర్లు, ఉపాధ్యాయుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. సన్మాన గ్రహీత విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ఆకాంక్షలు నెరవేచ్చేందుకు శక్తివంఛన లేకుండా కృషి చేస్తానన్నారు. క్వాంటం పెన్షన్ అంశంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పాటుపడతామని చెప్పారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన డీఏ, హెల్త్ కార్డు, ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్ వంటి అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు, ఏపీ ఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీవీ సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు అబ్దుల్ కరీం, ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కె.దాలినాయుడు, నారాయణరావు, జి. ప్రభుదాసు, బి.విష్ణువర్ధన్ రావు, ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర కోశాధికారి రంగారావు, మహిళా ప్రతినిధి రాజ్యలక్ష్మి, జిల్లా కార్యదర్శి డి.సత్యనారాయణరెడ్డి, సిటీ అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పెన్షనర్ల అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
ఏపీఎన్జీవో నేతలు కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగర్
Comments
Please login to add a commentAdd a comment