‘వావిలపల్లి’కి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం | - | Sakshi
Sakshi News home page

‘వావిలపల్లి’కి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం

Published Mon, Dec 23 2024 1:52 AM | Last Updated on Mon, Dec 23 2024 1:52 AM

‘వావిలపల్లి’కి రైల్వే  ప్రతిష్టాత్మక పురస్కారం

‘వావిలపల్లి’కి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వేలోనే అత్యున్నతమైన ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కారం’ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం వావిలపల్లి రాంబాబు అందుకున్నారు. శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన 69వ రైల్వే వారోత్సవాలలో కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతుల మీదుగా రాంబాబు పురస్కారం స్వీకరించారు. విధి నిర్వహణలో వినూత్న ప్రణాళికలతో రైల్వే అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రయాణికుల భద్రత విషయంలో కూడా ఆయన చూపిన ప్రతిభకు ఈ అత్యున్నత గౌరవం పొందారు. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండుసార్లు డివిజన్‌ ఆదాయం రూ.5 వేల కోట్లు మార్కు దాటడంతో పాటు సరుకు రవాణాలో రూ.4 వేల కోట్లు ఆదాయం సమకూరడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రయాణికుల భద్రత విషయంలోను ఎంతో ధైర్య, సాహసాలతో ఆయన వ్యవహరించిన తీరుపై ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. గత సెప్టెంబర్‌లో విజయవాడలో బుడమేరు వరదల సమయంలో రాయనపాడు, గుణదల రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. అందులోని సుమారు 4,100 మంది ప్రయాణికులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఈ సమయంలో సీనియర్‌ డీసీఎం వరద ప్రవాహంలోనే ఎదురెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అవార్డు స్వీకరించిన రాంబాబును డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ ప్రత్యేకంగా అభినందించారు.

రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌

చేతుల మీదుగా స్వీకరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement