మార్కెట్‌ ట్రెండ్‌ ఆధారంగా.. | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ట్రెండ్‌ ఆధారంగా..

Published Mon, Dec 23 2024 1:51 AM | Last Updated on Mon, Dec 23 2024 1:51 AM

మార్క

మార్కెట్‌ ట్రెండ్‌ ఆధారంగా..

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు గుగులోతు దసురునాయక్‌. జి.కొండూరు మండలంలోని చెర్వు మాధవరంలో ఉంటారు. ఎకరం విస్తీర్ణంలో టమాటా సాగు చేశారు. పెట్టుబడికి రూ. 60వేల వరకూ ఖర్చు అయ్యింది. ప్రస్తుతం టమాటాకు రేటు లేకపోవడంతో మార్కెట్‌కి తీసుకపోతే కేజీ రూ.10కి కూడా తీసుకోవడం లేదు. చేసేదిలేక తానే ఊరూరు తిరుగుతూ టమాటాలు అమ్ముకుంటున్నారు. ఇలా చేసినా ఇప్పటి వరకు రూ.20వేలు కూడా రాలేదని వాపోతున్నారు. టమాట సాగు చేసి తీవ్రంగా నష్టపోయానని.. ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్నారు.

టమాటా సాగు వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. ఒక్కొక్క మొక్క రూ.1తో బెంగళూరు నుంచి తెప్పించి నాటాం. ఎకరాకు రూ.15వేలు మొక్కలకే ఖర్చు అయ్యింది. పెట్టుబడి మొత్తం రూ.60వేలు దాటింది. టమాటాకి రేటు లేకపోవడంతో పెట్టుబడిలో సగం కూడా వచ్చేలా లేదు. టమాటా సాగు అంటేనే భయమేస్తోంది.

– మహాలక్ష్మి, రైతు, జి.కొండూరు

ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రస్తుతం

టమాటా సాగు వివరాలు

మండలం సాగు విస్తీర్ణం

(హెక్టార్లలో)

వత్సవాయి 02

జగ్గయ్యపేట 07

పెనుగంచిప్రోలు 04

నందిగామ 02

వీరులపాడు 03

మైలవరం 07

గంపలగూడెం 04

తిరువూరు 02

ఏ. కొండూరు 03

విసన్నపేట 01

జి. కొండూరు 13

కంచికచర్ల 03

చందర్లపాడు 02

ఇబ్రహీంపట్నం 02

రైతులు ఎప్పటికప్పుడు మార్కెట్‌ ట్రెండ్‌ ఆధారంగా సాగు చేపడితే లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా టమాటా సాగులో మేలైన సాగు పద్ధతులను పాటించాలి. హైబ్రీడ్‌ సీడ్‌తో మల్చింగ్‌, ట్రెల్లీస్‌ను వినియోగించిన సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. ఈ విధంగా సాగు చేయడానికి హెక్టారుకు రూ.20వేలు ప్రభుత్వం ఇస్తుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – వి. నీలిమ,

ఉద్యానాధికారి, ఇబ్రహీంపట్నం

జి.కొండూరు: సగటు మనిషి తినే ఆహారంలో టమాటాకు ప్రత్యేక స్థానం ఉంది. చింత పండుకు ప్రత్యామ్నాయంగా కూడా కూరలలో ఈ టమాటాని వినియోగిస్తుంటారు. అసలు టమాటా లేని ఇల్లు, టమాటా లేని రోజు అనేది ఉండదంటే మనిషి జీవనశైలిలో టమాటా ప్రాము ఖ్యత ఏంటో ఇట్టే అర్థమవుతుంది. అటువంటి టమాటాకు ఇప్పుడు కష్టమొచ్చింది. ధరలేక, పెట్టిన పెట్టుబడి రాక సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో గిట్టుబాటు ధరలేక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో నాడు వేల ఎకరాల్లో ఉన్న టమాటా సాగు, పూర్తిగా తగ్గిపోయి ప్రస్తుతం 136 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది.

పెట్టుబడి కూడా రాక..

ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రస్తుతం 55 హెక్టార్లలో మాత్రమే టమాటా సాగవుతోంది. అయితే ఎకరాకు మొక్కలు, మందులు, కూలీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి రూ.60వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ప్రస్తుతం టమాటా కిలో ధర రూ.10లోపే ఉండడంతో ఎకరాకు రూ.30వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మేలైన సేద్య పద్ధతులపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవడం, రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు అందకపోవడం, గిట్టుబాటు ధర కల్పించకపోవడం, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే నాణ్యమైన దిగుబడులను పొందలేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో టమాటా సాగు పూర్తిగా పడిపోయింది.

పూర్వ వైభవం వచ్చేనా..

ఎన్టీఆర్‌ జిల్లాలో 55హెక్టార్లకు

పడిపోయిన టమాటా సాగు

పెట్టబడి కూడా రాక అప్పుల

ఊబిలో కూరుకుపోతున్న రైతులు

నాడు టమాటా సాగులో జిల్లాలోనే

ప్రథమ స్థానంలో జి.కొండూరు

ప్రభుత్వం ప్రోత్సహించాలని

విన్నవిస్తున్న రైతులు

టమాటా సాగులో ఒకప్పుడు జి.కొండూరు మండలం జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండేది. జి.కొండూరు మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి గతంలో ఏడాదికి 2వేల టన్నులకు పైగా టమటాను రైతులు పండించి ఎగుమతి చేసేవారు. ఈ టమాటా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2014 ముందు వరకు వేయి ఎకరాలకు పైగా టమాటాను రైతులు సాగు చేయగా నష్టాలతో ఏటా తగ్గుతూ పదుల ఎకరాలకు సాగు పడిపోయింది. జి.కొండూరులో టమాటా మార్కెట్‌, జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న ప్రజా ప్రతినిధుల మాటలు నీటి మూటలుగా మిగిలాయి. ప్రభుత్వం ప్రోత్సహించి మార్కెట్‌, జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, గిట్టుబాటు ధర, రాయితీలు కల్పిస్తే మైలవరం నియోజకర్గంలో టమాటా సాగుకు పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మార్కెట్‌ ట్రెండ్‌ ఆధారంగా.. 1
1/1

మార్కెట్‌ ట్రెండ్‌ ఆధారంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement