విహార యాత్రకు వెళ్తూ మృత్యుఒడికి..
ద్వారకాతిరుమల: విహారయాత్రకు కారులో మారేడుమిల్లి వెళుతుండగా వెనుక నుంచి లారీని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఘంట సాల గ్రామానికి చెందిన స్నేహితులు వి.భాను ప్రకాష్, గెల్లి గౌతమ్ కుటుంబరావు (28), వెంకట సాయి, చల్లపల్లికి చెందిన వి.భార్గవ్, గొల్ల తేజ మంగళవారం రాత్రి విజయవాడలో కారును అద్దెకు తీసుకుని 11 గంటల సమయంలో మారేడుమిల్లి విహారాన్ని బయలుదేరారు. భానుప్రకాష్ కారును అతివేగంగా నడుపుతూ ఎం.నాగులపల్లి గ్రామ శివారులో ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టాడు. డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న గౌతమ్ కుటుంబరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురు గాయపడ్డారు. వారు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ అమీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు ఒకరు మృతి.. నలుగురికి గాయాలు ఎం.నాగులపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment