ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
గుడివాడరూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని నడిచి వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. జగన్నాథపురంలో నివసించే దొడ్డి జగన్మోహనరావు(57) బుధవారం ఉదయం ఇంటి నుంచి బంటుమిల్లి రోడ్‌లోని గుడికి నడిచి వెళ్తున్నాడు. గుడివాడ నుంచి బంటుమిల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్కెట్ సెంటర్ వద్ద జగన్మోహనరావును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి.గౌతమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు నుంచి జారిపడి
యువకుడి దుర్మరణం
తెనాలి రూరల్: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వేమూరు వద్ద పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ద్వారా అతడిని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామానికి చెందిన కొల్లూరు గోపి ప్రశాంత్ (27)గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment