ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు
విజయవాడస్పోర్ట్స్: నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. గొల్లపూడి నుంచి చినఅవుటపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్‌ను మేఘా కన్‌స్ట్రక్షన్ లైజన్ ఆఫీసర్ మురళి, ట్రాఫిక్ ఏడీసీపీ ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్‌తో కలిసి సీపీ బుధవారం పరిశీలించారు. భవానీదీక్షల విరమణ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ పెరిగిందని, ట్రాఫిక్ నియంత్రణ కోసం నగరంలోకి వచ్చే వాహనాలను గొల్లపూడి మైలురాయి సెంటర్ నుంచి ఇన్నర్ రింగ్‌రోడ్డు మీదుగా తరలించే తాత్కాలిక చర్యలు తీసుకున్నామని సీపీ పేర్కొన్నారు. ఈ క్రమంలో రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో వెస్ట్ బైపాస్‌కు వాహనాలను తరలిస్తున్నామని వెల్లడించారు. అయితే వెస్ట్ బైపాస్ పనులు అక్కడక్కడా పూర్తి కావాల్సిన నేపథ్యంలో వాహన చోదకుల సౌలభ్యం కోసం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నూతన సంవత్సరం, సంక్రాంతికి ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పశ్చిమ బైపాస్‌కు వాహనాలను తరలించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment