యువతను శక్తివంతం చేయటంతోనే మెరుగైన సమాజ నిర్మాణం
పెనమలూరు: యువతను శక్తివంతం చేయటంతోనే మెరుగైన సమాజం నిర్మాణం సాధ్యమని త్రిదిండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి తెలిపారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో సోమవారం నైతిక విలువల ఆధారంగా సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో స్వామీజీ పాల్గొని ప్రసంగించారు. విద్య లేక పోతే ప్రపంచం తనకు తానే కూలిపోతుందని చెప్పారు. విలువలు, క్రమశిక్షణ, నైతిక బాధ్యతలు సమాజ నిర్మాణానికి పునాదిరాళ్లుగా పేర్కొన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో విలువలను ఆచరిస్తూ సమాజానికి సేవలు అందించాలని సూచించారు. సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షుడు వెళ్లంకి నాగభూషణం, వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment