నందిగామ టౌన్: కుటంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని అంబారుపేట గ్రామానికి చెందిన పాస్టర్ పట్రా వంశీకి గుడివాడకు చెందిన ప్రసన్న (26)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. పాస్టర్ వంశీ ఆయా గ్రామాల్లో ప్రార్థనలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రార్థనల పేరుతో ఊర్లు పట్టుకుని తిరగకుండా స్వగ్రామంలోనే ఏదో ఒక పని చేసుకుందామని ప్రసన్న చెప్పటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ప్రసన్న శుక్రవారం రాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి కొక్కిలగడ్డ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అభిమన్యు తెలిపారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
చీరకు నిప్పంటుకుని వృద్ధురాలి మృతి
నందిగామ టౌన్: చీరకు నిప్పంటుకోవటంతో శరీరం కాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని రుద్రవరం గ్రామానికి చెందిన నండ్రు యశోద (71) చిన్న కుమారుడు నాగరాజుతో కలిసి నివాసముంటుంది. వయసు మీద పడటంతో మతిమరుపు, వినబడకపోవటం, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె స్నానం చేసేందుకు కట్టెల పొయ్యి మీద నీటిని కాస్తుండగా చీరకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించి శరీరం తీవ్రంగా కాలింది. గమనించిన కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేసి హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ తరలించగా అక్కడ మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment