విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Sun, Feb 2 2025 1:33 AM | Last Updated on Sun, Feb 2 2025 1:33 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

I

డీజీపీతో కృష్ణా ఎస్పీ భేటీ

కోనేరుసెంటర్‌: డీజీపీ హరీష్‌ కుమార్‌గుప్తాను కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు శనివారం మర్యాదపూర్వ కంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌ ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా ఉంది. రూ.12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపు మధ్య తరగతి, ఉద్యోగులకు ఊరట కలిగిస్తుంది. దీని వల్ల మార్కెట్‌లో ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి, ఆర్థ్ధిక వృద్ధికి అవకాశం కలుగు తుంది. దేశంలో నైపుణ్యం లేని కారణంగా యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. తాజా బడ్జెట్‌లో కేంద్రం స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేక చోటు కల్పించింది.

– డాక్టర్‌ డి.కై లాసరావు, అర్థశాస్త్ర విశ్రాంత ఆచార్యుడు

సాక్షి, మచిలీపట్నం: వికసిత్‌ భారత్‌ లక్ష్యమంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి కృష్ణా జిల్లాపై కరుణ చూపలేదు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు నిధుల కేటాయింపులపై స్పష్టత ఇవ్వలేదు. కూటమిలో భాగమైన చంద్ర బాబు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండ డంతో నిధులు, కేటాయింపులు బాగానే ఉంటా యని ప్రజలు ఆశించినా నిరాశ తప్పలేదు. రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులతో పాటు కొత్త వాటి ఊసే ఎత్తలేదు. ఇతర భారీ ప్రాజెక్టుల ప్రకటనలు లేకపోవడంతో అందరిలో అసంతృప్తి నెలకొంది. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల్లోనూ స్పష్టత కరువైంది. అయితే మధ్యతరగతి, వేతన జీవులకు మాత్రం శుభవార్త లభించింది. ఆదాయ పన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంచడంతో ఊరట దక్కింది.

ఊసేలేని రైల్వే ప్రాజెక్టులు

కేంద్ర బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల ఊసే లేదు. గతంలో రైల్వే బడ్జెట్‌ వేరుగా ఉండేది. అయితే ఏన్డీఏ ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపి ప్రవేశపెడుతూ వస్తోంది. దీర్ఘకా లికంగా డిమాండ్‌లో ఉన్న మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్‌ గురించి ప్రస్తుత బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు. సుమారు 45 కిలో మీటర్ల పొడవైన ఈ రైలు మార్గం ఏర్పడితే ప్రయాణ, రవాణా సమస్యలు తొలగిపోతాయి. బందరు, నరసాపురం మధ్య నూతన మార్గం, బందరు – గుడివాడ, ఇతర స్టేషన్ల డబ్లింగ్‌, ఆధునికీకరణ పనుల కోసం రూ.221 కోట్లు, మచిలీపట్నం – గుడివాడ, విజయవాడ – గుడివాడ, భీమవరం – నరసాపురం, భీమవరం – నిడదవోలు స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు రూ.251 కోట్లు కావాల్సి ఉంది. ఆ నిధుల ప్రస్తావన లేదు.

ఉద్యోగులకు ఊరట

కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి ఉద్యోగులకు ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు. ఇందులో రూ.4 లక్షలు వరకు ఎలాంటి పన్ను ఉండదు. ఆపై రూ.12 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవు తోంది. కృష్ణా జిల్లాలో సుమారు 12 వేల మంది ఉద్యోగులు, 15 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 10 వేల మంది రూ.12 లక్షల లోపు ఆదాయం వారే. ఎన్టీఆర్‌ జిల్లాలో 25 వేల మంది వరకు ఉద్యోగులు, 20 వేల మందికి పైగా పెన్షనర్లు ఉంటారు. వీరిలో 20 వేల మంది వరకు రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు ఉంటారని అంచనా.

ముఖ్యాంశాలు

● రైతుల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితిని రూ.5 లక్షలు చేయడం మంచిదేనన్న అభిప్రాయం వస్తోంది. మినుముల కొనుగోలుపై ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల హెక్టార్లలో మినుము సాగుచేస్తున్న రైతులకు మేలు కలుగుతుంది. పత్తి కొనుగోలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి కృష్ణాలో 25 వేల హెక్టార్లకు పైగా పత్తి సాగు అవుతోంది.

● ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లు పెరగనున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మచిలీపట్నంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను నిర్మించారు. ఇందులో ప్రస్తుతం 150 సీట్లు ఉన్నాయి. వీటి సంఖ్య పెరగనుంది.

● ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంతో పాటు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో వీటి వాడుక రోజురోజుకు పెరిగిపోతోంది.

కేంద్ర బడ్జెట్‌ వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా ఇచ్చే రుణాన్ని రూ.5 లక్షలకు పెంచారు. వంద జిల్లాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రూ.1.7 లక్షల కోట్లు కేటాయించడం బాగుంది. బీమా రంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులకు వీలు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. 120 రూట్లలో విమానయాన సంస్థలను ప్రోత్సహించే అంశాలు దేశ అభివృద్ధికి అండగా ఉంటాయి.

– డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, అధ్యాపకుడు

న్యూస్‌రీల్‌

కేంద్ర బడ్జెట్‌లో కరుణించని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు నిల్‌ రైల్వే ప్రాజెక్ట్‌ల ఊసు.. కొత్త ప్రతిపాదనల ప్రస్తావన లేదు మధ్య తరగతి, ఉద్యోగులకు ఆదాయ పన్నులో ఊరట రూ.12 లక్షల వరకుపన్ను నుంచి మినహాయింపు కేంద్ర బడ్జెట్‌పై వివిధ రంగాల నిపుణుల భిన్నస్వరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/8

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement