త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి
పర్లాకిమిడి: పర్లాకిమిడి నియోజికవర్గంలో కేంద్ర, రాష్ట్ర ఆమోదిత పథకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అధికారులను కోరారు. జిల్లా పరిషత్ హాల్‌లో గురువారం తొలిసారిగా జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల అభివృఽధ్ధి సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ బిజయకుమార్‌దాస్ అధ్యక్షత వహించగా.. జెడ్పీ అధ్యక్షులు గవర తిరుపతి రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, సీడీఎం గుణనిధినాయక్, డీఎఫ్‌వో సుబ్రహ్మణ్యం ఆనంద్, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠిలు పాల్గొన్నారు. ముఖ్యంగా పర్లాకిమిడి నియోజకవర్గంలోని గుసాని, కాశీనగర్, గుమ్మా సమితిలలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 186 ప్రాజెక్టులకు ఆమోదం కాగా వాటిలో కేవలం 68 పనులు పూర్తవ్వగా.. 89 పనులు పూర్తికాలేదు. మొత్తంగా 23–24 వార్షిక సంవంత్సరానికి కేవలం రూ.164.60 కోట్ల నిధులు ఖర్చు కాకుండా ఉండిపోయినట్టు డీఆర్‌డీఏ అధికారులు తెలియజేశారు. దీనిపై జిల్లా పరిషత్ అధ్యక్షులు జి.తిరుపతిరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఎస్.బాలరాజు గుసాని బీడీవో ఇంజినీర్లను నిలదీశారు. అలాగే అటవీ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ నిధులపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో గుసాని సమితి అధ్యక్షులు ఎన్.వీర్రాజు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, గుమ్మా నుంచి సునేమీ మండళ్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పర్లాకిమిడిఎమ్మెల్యే రూపేష్ కుమార్
పాణిగ్రాహి
Comments
Please login to add a commentAdd a comment