జయపురం ఎంజీ రోడ్డులో ఆక్రమణల తొలగింపు
జయపురం: స్థానిక మహాత్మాగాంధీ రోడ్డు(ఎంజీ రోడ్డు)లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్డు వెడల్పు చేసేందుకు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను గురువారం అధికారులు ప్రారంభించారు. వెలకం జంక్షన్ నుంచి గాంధీ జంక్షన్ వరకు 40 అడుగుల రోడ్డు ఏర్పాటుకు జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి పర్యవేక్షణంలో జేసీబీ యంత్రాలతో తొలగింపు కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ వారు కొలతలు వేసి మార్క్ చేసినంత వరకు కొంత మంది వ్యాపారులు స్వయంగా కట్టడాలను తొలగించారు. ఆక్రమణల తొలగింపుపై అధికారులు కసరత్తు చేస్తుండటంతో వ్యాపారులు అధికారులను కలిసి రోడ్డు వెడల్పును 20 అడుగులకు బదులు 18 అడుగులు చేయాలని కోరారు. అయితే అధికారులు అంగీకరించలేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం రోడ్డు వెడల్పు కోసం ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment