బాకై ్సట్ తవ్వకాలకు మద్దతుగా ర్యాలీ
రాయగడ: జిల్లాలోని కాశీపూర్‌సమితిలో ప్రకృతి సంపదలు సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వనరులను సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించి వినతిపత్రంను కలెక్టర్ ఫరూల్ పట్వారీకి గురువారం అందజేశారు. కాశీపూర్ సమితిలో గల బాకై ్సట్ గనులను తవ్వేందుకు వేదాంత్ అనే బృహత్తర కంపెనీకి ప్రభుత్వ అనుమతి ఇచ్చిందని అందుకు ఆ కంపెనీ ఆధ్వర్యంలో గల మైత్రీ ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తవ్వకాలకు ముందుకువస్తే కొందరు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. మైత్రీ సంస్థకు మద్దతుగా వారంతా మాట్లాడారు. కాశీపూర్ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. డీసీసీ మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పండ, బీజేడీ సీనియర్ నాయకుడు జగదీష్ పాత్రొ, సమితి అధ్యక్షులు కొంఠొమాజి, ఇతర పార్టీలకు చెందిన నాయకులు తమ మద్దతును తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment