భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ విపక్ష నేత జయ నారాయణ మిశ్రాకు ముందస్తు బెయిలు మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అనుకూల ఉత్తర్వులు జారీ చేస్తే నిష్పక్షపాత దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల 15న సంబల్‌పూర్ జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదురుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బలవంతంగా కార్యాలయంలోనికి చొరబడుతన్న జయ నారాయణ మిశ్రాని అడ్డుకునే సమయంలో మహిళా పోలీసు సిబ్బందిపై చేయి చేసుకోవడంతో దుర్భాషలాడారు. ఈ ఆరోపణతో మహిళా పోలీసు సిబ్బంది ఆయనకు వ్యతిరేకంగా ఠాణాలో ఫిర్యాదు దాఖలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా జయ నారాయణ మిశ్రా కూడా ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిలు కోసం జయ నారాయణ మిశ్రా రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన న్యాయ స్థానం బెయిలు మంజూరు తిరస్కరించింది. ఈ ఉత్తర్వుల్ని సవాలు చేసి నిందిత నాయకుడు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్క ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment