ఉపాధి వేతనదారుకు అస్వస్థత
బాడంగి: ఓ విషపురుగు పాదంపై కాటు వేయడంతో ఉపాధివేతనదారు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలాఉన్నాయి. మండలంలోని రేజేరు గ్రామానికి చెందిన పూడి అప్పలస్వామి ఉపాధి వేతనదారు. ఎప్పటిలాగానే పనిలోకివెళ్లి పనిచేస్తుండగా కనిపించని విషపురుగు కాలిపాదంపై కాటువేయగా స్పృహకోల్పోయాడు. వెంటనే తొలుత తెర్లాం పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్సచేయించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం స్థానిక సీహెచ్‌సీకి తరలింగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఎంపీడీఓ ఎస్ రామకృష్ణ పరామర్శకు వెళ్లగా ఒకరోజుపాటు తమ అబ్జర్వేషన్‌లో ఉంచాలని డాక్టర్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment