పింఛన్ల రికవరీపై విచారణ
వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల గ్రామానికి చెందిన అనర్హులైన ఏడుగురు వ్యక్తులు పింఛన్లు తీసుకుంటున్నారని లోకాయుక్తకు అందిన ఫిర్యాదుతో పలుమార్లు విచారణ చేపట్టిన అధికారులు తాజాగా మంగళవారం మళ్లీ గ్రామంలో మరోమారు విచారణ చేపట్టారు. పాలకొండ డీఎల్‌డీఓ వి.గోపాలకృష్ణ, తహసీల్దార్ చందక సత్యనారాయణ, ఎంపీడీఓ బి.వెంకటరమణలు పింఛన్‌దారులను పిలిపించి వివరాలు సేకరించారు. గత టీడీపీ పాలనలో 2018–19 మధ్య కాలంలో గ్రామానికి చెందిన ఎన్.లచ్చిశెట్టి రూ.23,500(11 నెలలు),గంట రాము రూ.23,500(11 నెలలు),బోను అప్పయ్య రూ.34,750( 21 నెలలు), కొమరాపు పోతయ్య రూ.34,750(21 నెలలు),బి.లక్ష్మం రూ.34,750 (21నెలలు) వై.వెంకయ్య రూ.32,500(19 నెలలు) కె.సీతమ్మ రూ.29,000(14 నెలలు) మొత్తం రూ.2,12,750 లు వృధ్యాప్యపు పింఛన్ల ద్వారా తీసుకున్నారని, వారంతా అనర్హులని గ్రామానికి చెందిన యామక అప్పలనాయుడు అప్పట్లో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పలుమార్లు అధికారులు విచారణ చేశారు. 2019లో డిసెంబర్‌లో వీరికి వస్తున్న పింఛన్లను అధికారులు నిలిపివేశారు. వారి నుంచి ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో లోకాయుక్త నుంచి ఆదేశాలు అందాయి. రికవరీ ఎందుకు చేయలేదని మరోమారు లోకాయుక్త నుంచి ఆదేశాలు రావడంతో విచారణ చేపట్టినట్లు డీఎల్‌డీఓ గోపాలకృష్ణ తెలిపారు.అయితే వారిలో ఇద్దరు వ్యక్తులు వై.వెంకయ్య,కె.సీతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందినట్లు గుర్తించారు.మిగిలిన వారిని పిలిచి విచారణ చేశామని అధికారులు తెలిపారు. తొందరగా తీసుకున్న సొమ్ము తిరిగి కట్టాలని వారిని ఆదేశించామని అధికారులు చెప్పారు.
లోకాయుక్త ఆదేశాలతో కదిలిన
యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment