విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న చెస్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల ఎంపిక పూర్తయింది. ఈ మేరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఈఓ కేవీ.జ్వాలాముఖి ఎంపికై న క్రీడాకారుల జాబితాను మంగళవారం ప్రకటించారు. ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన పేర్కొన్నారు. పోటీలలో అండర్–6 బాలికల విభాగంలో జి.వేద సాయి శ్రీ(పీఎస్‌ఆర్ స్కూల్) ఎన్.ధాన్విక (భాష్యం స్కూల్) సీహెచ్.రేణూశ్రీ (చాణక్య స్కూల్).. బాలుర విభాగంలో ధీరజ్(ఫోర్ట్ సిటీ స్కూల్) యశస్విన్ (చాణక్య స్కూల్) ఎంపికై నట్లు తెలిపారు. అదేవిధంగా అండర్–8 బాలికల విభాగంలో జాష్విక(ఫోర్ట్‌సిటీ స్కూల్) అనన్య(బీసెంట్ స్కూల్)..బాలుర విభాగంలో ధనుష్(ఆదిత్య స్కూల్) హిమాంక్(ఇన్‌స్పైర్ స్కూల్), అండర్–10 బాలికల విభాగంలో అమృత(కేంద్రీయ విద్యాలయ), వైష్ణవి(ప్రభుత్వ పాఠశాల, తిమిడి), బాలుర విభాగంలో పర్వేష్(బీసెంట్ స్కూల్) జిగ్నేష్(కేంద్రీయ విద్యాలయ) ఎంపికై నట్లు పేర్కొన్నారు. అలాగే అండర్–12 బాలికల విభాగంలో సాయి ధృతి(సన్ స్కూల్) గరిమ సంస్కృతి(నేషనల్ స్కూల్)..బాలుర విభాగంలో ఆదిత్య(మానస స్కూల్), చైతన్య శ్రీనివాస్(సెయింట్ జోసెఫ్ స్కూల్) ఎంపికయ్యారు. అండర్–14 బాలికల విభాగంలో బి. షణ్ముఖ ప్రియ(సెయింట్ ఆన్స్ ప్రభుత్వ పాఠశాల), జి. కుందన ప్రియ(నేషనల్ స్కూల్), బాలుర విభాగంలో జీకేఎం అభినవ్ రెడ్డి(బీపీఎం ప్రభుత్వ పాఠశాల), వి.లోకేష్(భాష్యం) ఎంపికయ్యారని ప్రకటించారు. అండర్–16 బాలికల విభాగంలో కె.లహరి(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మరడాం), సీహెచ్. గాయత్రి దేవి(ఏపీ మోడల్ స్కూల్, మరుపల్లి), బాలుర విభాగంలో డి.లీలా మనోహర్(ఫోర్ట్ సిటీ స్కూల్) కె.హర్ష వర్థన్(పల్లవి స్కూల్)లు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment